ఆరాధించెదం

పాట రచయిత: ఫిలిప్ గరికి
Lyricist: Philip Gariki

Telugu Lyrics

ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలో
ఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలో
సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం
జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము
యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా

యెరికో కోట గోడలన్ని కూలిపోయే – కాలిపోయే
ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా – ఆర్భాటించగా
స్తుతులపై ఆసీనుడా యేసయ్యా
మా ప్రార్ధనలు ఆలకించువాడా
స్తుతియాగము చేయు వాడే
నిన్ను మహిమ పరచు వాడు       ||యేసయ్యా||

యూదా దేశము మీదికి శత్రు సైన్యము – దండెత్తగా
యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా – స్తోత్రము చేయగా
దేవుడే యుద్ధము జరిపెను
అద్భుత జయమును పొందిరి
బెరాకా లోయలో కూడిరి
కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి       ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మా సర్వానిధి నీవయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మా సర్వానిధి నీవయ్యా
నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా…
మా ప్రియమైన యేసయ్యా (2)        ||మా సర్వానిధి||

మా పాపములకై కలువరి గిరిపై
నలిగితివా మా ప్రియ యేసయ్యా (2)
విరిగి నలిగిన హృదయాలతో (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2)          ||యేసయ్యా||

నీవే మార్గము – నీవే సత్యము
నీవే జీవము – మా యేసయ్యా (2)
జీవపు దాత శ్రీ యేసునాథ (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2)          ||యేసయ్యా||

మా స్నేహితుడవు – మా రక్షకుడవు
పరిశుద్ధుడవు – మా యేసయ్యా (2)
పరిశుద్ధమైన నీ నామమునే (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2)          ||యేసయ్యా||

English Lyrics

Audio

స్తుతి సింహాసనాసీనుడా

పాట రచయిత: అంశుమతి మేరీ
Lyricist: Amshumathi Mary

Telugu Lyrics


స్తుతి సింహాసనాసీనుడా
యేసు రాజా దివ్య తేజా (2)

అద్వితీయుడవు పరిశుద్ధుడవు
అతి సుందరుడవు నీవే ప్రభూ (2)
నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2)
కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2)       ||స్తుతి||

బలియు అర్పణ కోరవు నీవు
బలియైతివి నా దోషముకై (2)
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2)
స్తుతియాగమునే చేసెద నిరతం (2)       ||స్తుతి||

బూరధ్వనులే నింగిలో మ్రోగగా
రాజధిరాజ నీవే వచ్చువేళ (2)
సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2)
పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2)       ||స్తుతి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME