సుందరములు

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2)
ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు (2)

యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2)
తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2)      ||ఏ లేమికి||

లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు (2)
తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు (2)      ||ఏ లేమికి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నిను చూసే కన్నులు

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics

నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)
నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2)
నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా          ||నిను చూసే||

కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)
నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా
నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా               ||నిను చూసే||

అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)
కోపతాపములు దూరపరచయ్యా
అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా          ||నిను చూసే||

English Lyrics

Audio

HOME