అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు
(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2)       ||అబ్రాహాము||

అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని
ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2)
యాకోబును ఇశ్రాయేలని దీవించి
ఈ పాపిని నీవు విడువక ప్రేమించి
నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా
నీ చేతి నీడలో జీవింతునయ్యా (2)       ||అబ్రాహాము||

జీవాహారము నేనే అని పలికితివి
జీవ జలముల ఓరన నను నాటితివి (2)
నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి
హృదయము నుండి జీవ జలములు పుట్టించి
నీ జీవాహారము – నీ జీవజలమును
నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2)       ||అబ్రాహాము||

English Lyrics

Audio

జై జై జై యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్…

జై జై జై యేసయ్యా
పూజ్యుడవు నీవయ్యా
ఈ లోకానికొచ్చావయ్యా
సంతోషం తెచ్చావయ్యా
మాకు సంతోషం తెచ్చావయ్యా (2)

కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా
పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)
పశుల పాకలో పశుల తొట్టిలో
పసి బాలుడుగా ఉన్నావయ్యా (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)        ||జై జై జై||

దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను
నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2)
లోక రక్షకుడు జన్మించెనని
సంతోషముతో ఆనందముతో (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)         ||జై జై జై||

English Lyrics

Audio

Lyrics:

 

 

HOME