యేసు నీ వారము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు నీ వారము – నీవే మా రాజువు (2)
తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే (2)      ||యేసు||

మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలం
అన్నీ నీవొసగినవే
మాదంతా నీకేలే – మహిమంతా నీకేలే
స్తుతి స్తోత్రముల్ నీకేలే (2)
సర్వంబు నీవైన ప్రభువా
హల్లెలూయ స్తుతి మహిమ నీకే (2)      ||యేసు||

ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరు
అన్నీ నీవొసగినవే
ఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని ఆ చంద్రుని
మాకోసం నిలిపితివే (2)
ఆద్యంతముల ప్రభువా
ఆరాధింతుము నిన్నే (2)      ||యేసు||

సిలువలో మరణించి – మరణమునే ఓడించి
జయమును పొందితివే
పాపములు క్షమించి – జీవమును మాకిచ్చి
పరమును ఒసగితివే (2)
మమ్మెంతో ప్రేమించి
మా కొరకు నిలచితివే (2)      ||యేసు||

English Lyrics

Audio

 

 

నీతో సమమెవరు

పాట రచయిత: ఆకుమర్తి డేనియల్
Lyricist: Akumarthi Daniel

Telugu Lyrics

నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు
నీలా క్షమియించేదెవరు – యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు (2)

లోక బంగారము – ధన ధాన్యాదులు
ఒక పోగేసినా – నీతో సరితూగునా
జీవ నదులన్నియు – సర్వ సంద్రములు
ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన
నీవేగా చాలిన దేవుడవు       ||నీతో||

పలు వేదాలలో – మత గ్రంథాలలో
పాపమే సోకని – పరిశుద్దుడేడి
పాప పరిహారార్థం – సిలువ మరణమొంది
తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా
నీవేగా మంచి దేవుడవు        ||నీతో||

నేను వెదకకున్నా – నాకు దొరికితివి
నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి
పలు గాయాలు చేసి – తరచు రేపితిని
నన్నెంతో సహించి – క్షమియించితివి
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి
నీవేగా విమోచకుడవు       ||నీతో||

English Lyrics

Audio

సర్వ యుగములలో సజీవుడవు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2)

ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2)
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా (2)       ||సర్వ యుగములలో||

స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2)
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా (2)       ||సర్వ యుగములలో||

కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2)
నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
శత్రువు నణచిన బహు శూరుడా (2)       ||సర్వ యుగములలో||

English Lyrics

Audio

నా ప్రాణానికి ప్రాణం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా
స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా
నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా         ||నా ప్రాణానికి||

ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు
కన్నీటి సమయములో ఒంటరిని చేసారు (2)
ఆస్తులున్న వేళలో అక్కున చేరారు
ఆపద సమయాలలో అంతు లేకపోయారు
జంటగా నిలిచితివి నా ప్రాణమా
కన్నీరు తుడిచితివి నా స్నేహమా
కన్నీరు తుడిచితివి నా స్నేహమా
కన్నీరు తుడిచితివి …            ||నా ప్రాణానికి||

నీవే నా ప్రాణమని కడవరకు విడువనని
బాసలన్ని మరచి అనాథగా నను చేసారు (2)
నేనున్నానంటూ నా చెంతన చేరావు
ఎవరు విడచినా నను విడవనన్నావు
జంటగా నిలిచితివి నా ప్రాణమా
కన్నీరు తుడిచితివి నా స్నేహమా
కన్నీరు తుడిచితివి నా స్నేహమా
కన్నీరు తుడిచితివి …            ||నా ప్రాణానికి||

English Lyrics

Audio

HOME