చెప్పనా చెప్పనా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చెప్పనా చెప్పనా  యేసు నీ ప్రేమను
చూపనా చూపనా మార్చిన బ్రతుకును
గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా
ప్రాణమే పెట్టిన ఈ ప్రేమ మరుతునా (2)            ||చెప్పనా||

చీకటి రాత్రిలో చీరు దీపమైన లేక
ఏ ఒడ్డుకు చేరుతానో తెలియని వేళ
కంటినిండ కన్నీళ్ళతో బరువెక్కిన గుండెతో
అయిపోయిందంతా అనుకున్నవేళ
నా చేయి పట్టావు నా వెన్నుతట్టావు
నేనున్నానని నన్ను నిలబెట్టావు               ||చెప్పనా||

నిందలన్ని తొలగించి ఆనందము నాకిచ్చి
బాధ కలుగు దేశమందు బలమిచ్చావు
ఒంటరైన నన్ను చేర్చి పదివేలుగ నన్ను మార్చి
అవమానము తొలగించి బలపరిచావు
అంతులేని ప్రేమ చూపి హద్దులేని కృపనిచ్చి
నీ చల్లని నీడలో నను దాచావు              ||చెప్పనా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా ప్రియుడు యేసు

పాట రచయిత: ఎం ఎస్ శాంతవర్ధన్
Lyricist: M S Shanthavardhan

Telugu Lyrics


నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు
వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2)         ||నా ప్రియుడు||

మెల్లని చల్లని స్వరమే వినబడెను (2)
తండ్రీ వీరేమి చేయుచున్నారో (2)
ఎరుగరు గనుక క్షమించుమనెన్
ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే         ||నా ప్రియుడు||

అతని ప్రేమ మధురం మధురం
ఎన్నటికీ నే మరువలేను (2)
ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం
శాపమంతా బాపి నను దీవించెనుగా         ||నా ప్రియుడు||

వీపంతా దున్నబడె నాగలితో
కారె రక్త వరదల్ కనుమా (2)
యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత
నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా         ||నా ప్రియుడు||

తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి
నాకై విన్నతి చేయుచున్నాడు (2)
రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే
నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును         ||నా ప్రియుడు||

English Lyrics

Audio

HOME