స్తుతి పాడనా నేను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్తుతి పాడనా నేను
నన్ను కాచే యేసయ్యా
నా జీవాన్నదాతకు
నను నడిపే ప్రభువుకు

పాపములో పడియున్న వేళ
వదలకనే దరి చేర్చిన దాత
నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా     ||స్తుతి||

సోలిపోయి తూలుతున్న వేళ
జాలితో నను పిలచిన నా దేవా
నా హృదయ ధ్యానము నీకే అర్పింతును     ||స్తుతి||

భూమినేలే రారాజు నీవని
ధరణిలోని నీ మహిమను ప్రకటించ
నీ రెక్కల చాటున నను దాచే నీడవని     ||స్తుతి||

English Lyrics

Audio

నీవే నీవే కావాలి

పాట రచయిత: పాల్ ఇమ్మానుయేల్ & నిస్సీ పాల్
Lyricist: Paul Emmanuel & Nissy Paul

Telugu Lyrics

నీవే నీవే కావాలి ప్రభువుకు
నేడే నేడే చేరాలి ప్రభువును (2)
ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2)       ||నీవే||

నీ సృష్టికర్తను నీవు విడచినా
నీకిష్టమైన రీతి నీవు నడచినా (2)
దోషివయినా ద్రోహివయినా
దేవుని చెంత – చేరిపుడైనా (2)      ||ఈ కాలం||

పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా (2)
యేసుని చరణం – పాప హరణం
యేసుని స్నేహం – పాపికి మోక్షం (2)      ||ఈ కాలం||

నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2)
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ – కోరిపుడైనా (2)      ||ఈ కాలం||

English Lyrics

Audio

HOME