బ్యూలా దేశము నాది

పాట రచయిత: ఆర్ ఆర్ కే మూర్తి
Lyricist: RRK Murthy

Telugu Lyrics

బ్యూలా దేశము నాది
సుస్థిరమైన పునాది (2)
కాలము స్థలము లేనిది (2)
సుందర పురము – నందనవనము (2)      ||బ్యూలా||

స్పటిక నది తీరము నాది
అన్నిటిలో ఘనం అనాది (2)
అపశ్రుతి లేని రాగములు (2)
అలరెడు పురము యేసుని వరము (2)      ||బ్యూలా||

జీవ వృక్ష ఫల సాయము నాది
దేవుని మహిమ స్పర్శ వేది (2)
మరణం బాధే లేనిది (2)
అమరుల పురము మంగళకరము (2)      ||బ్యూలా||

English Lyrics

Audio

సీయోనులో స్థిరమైన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే

సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2)

సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని (2)
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా (2)          ||సీయోనులో||

కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని (2)
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా (2)          ||సీయోనులో||

సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2)
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3)
ఆనందమే పరమానందమే (10)

English Lyrics

Audio

HOME