నా యేసు రాజు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా యేసు రాజు
నాకై పుట్టిన రోజు (2)
క్రిస్మస్ పండుగా
హృదయం నిండుగా (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)       ||నా యేసు||

పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పశు పాకలో పుట్టెను
పశువుల తొట్టిలో వింతగా (2)     ||హ్యాపీ||

నమ్మిన వారికి నెమ్మది
ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
ప్రతి వారిని పిలిచెను
రక్షణ భాగ్యమునివ్వగా (2)     ||హ్యాపీ||

సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్ (2)      ||నా యేసు||

English Lyrics

Audio

జగతికి వెలుగును తెచ్చెనులే

పాట రచయిత: సిరివెళ్ల హనోక్
Lyricist: Sirivella Hanok

Telugu Lyrics


జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్
వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్
రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్
మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2)

ఈ రాత్రిలో కడు దీనుడై
యేసు పుట్టెను బెత్లెహేములో (2)
తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై
నీ కోసం నా కోసం పవళించే పాకలో (2)        ||జగతికి||

ఇమ్మానుయేలుగా అరుదించెను
దైవ మానవుడు యేసు దేవుడు (2)
నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు
ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2)         ||జగతికి||

English Lyrics

Audio

బాలుడు కాదమ్మో

పాట రచయిత: డేనియల్ కళ్యాణపు
Lyricist: Daniel Kalyanapu

Telugu Lyrics


బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేసయ్యా (2)          ||బాలుడు||

కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)
మా మంచి కాపరని సంతోషించామే
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)         ||బాలుడు||

చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)          ||బాలుడు||

English Lyrics

Audio

HOME