స్తుతులకు పాత్రుడా (ఆరాధన)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
నిరతము నిలచువాడా – నీకే స్తోత్రము
త్వరలో రానున్న – మా మెస్సయ్యా
మరణము గెలచిన మా విమోచకుడా
ఆరాధన చేసెదం
అజేయుడా మా ప్రభూ
అద్వితీయ సత్య దేవుడా
నీవే మా రాజువు (2)            ||స్తుతులకు||

నీతియు సమాధానము
ఆనందము నీ రాజ్యము
నీ సిలువయే మాకు శక్తి
నీ సిలువయే మాకు బలము (2)
ఆత్మానుసారమైన
నవీన జీవితమునిచ్చితివి
ఆత్మ నియమము ద్వారా
పాప మరణము నుండి విడిపించితివి (2)            ||ఆరాధన||

నీవే మా నిరీక్షణకర్తవు
నమ్మదగినవాడవు
నీలోనే మా అతిశయము
మమ్ము విలువ పెట్టి కొన్నావు (2)
ప్రభువా మీతో మేము
ఏకాత్మయై యున్నాము
అక్షయమగు కిరీటము
ధరియింపజేయువాడవు నీవే (2)            ||ఆరాధన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మల్లెలమ్మా మల్లెలు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2)
ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2)

నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2)
జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2)         ||మల్లెలమ్మా||

అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2)
నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2)         ||మల్లెలమ్మా||

రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2)
లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2)         ||మల్లెలమ్మా||

పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి (2)
పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2)         ||మల్లెలమ్మా||

పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి (2)
రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా (2)         ||మల్లెలమ్మా||

నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి (2)
పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2)         ||మల్లెలమ్మా||

English Lyrics

Audio

ఈ దినం సదా

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

ఈ దినం సదా నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2)
రానున్న కాలము – కలత నివ్వదు (2)
నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును        ||ఈ దినం||

ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాటయైనను (2)
వెరవదెన్నడైనను నాదు హృదయము (2)
గాయపడిన యేసుపాదం అందు నడచెను (2)         ||ఈ దినం||

ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే
విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
యెహోవా నిస్సియే నాదు విజయము         ||ఈ దినం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME