ప్రియమైన యేసయ్యా

పాట రచయిత: డేవిడ్ విజయరాజు
Lyricist: David Vijayaraju

Telugu Lyrics

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2)        ||ప్రియమైన||

జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2)       ||నా ప్రియుడా||

ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2)       ||నా ప్రియుడా||

ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2)       ||నా ప్రియుడా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

HOME