దివిటీలు మండాలి

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics


దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి
ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా
ఇది నిదురించగా సమయమా
నీవు వెనుదిరిగితే న్యాయమా

ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు
ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2)
ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో (2)
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా          ||దివిటీలు||

రాకడ కాలపు సూచనలని చూచాయి
ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2)
పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి (2)
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా            ||దివిటీలు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సహోదరులారా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సహోదరులారా ప్రతి మనుష్యుడు
ఏ స్థితిలో పిలువబడెనో
ఆ స్థితియందే దేవునితో సహవాసము
కలిగియుండుట మేలు (2)

సున్నతి లేకుండ పిలువబడితివా
సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2)
సున్నతి పొంది నీవు పిలువబడితివా
సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2)
దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే
మనకెంతో ముఖ్యమైనది (2)        ||సహోదరులారా||

దాసుడవైయుండి పిలువబడితివా
స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2)
స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా
క్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2)
విలువ పెట్టి మనము కొనబడినవారము
మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2)         ||సహోదరులారా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

HOME