యేసు రాజా నీకే

పాట రచయిత: బన్ని సుదర్శన్
Lyricist: Bunny Sudarshan

Telugu Lyrics


యేసు రాజా నీకే
ఈ స్తుతి ఆరాధన
నా యేసు రాజా నీకే
నా స్తుతి సంకీర్తన
ఆరాధన స్తుతి ఆరాధన
సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ (2)       ||యేసు||

నీ మాటలో కరుణ
నీ చూపులో ఆదరణ
నీ ప్రేమలో రక్షణ
నీ కుడి చేతిలో దీవెన (2)
నీతోనే నిత్యానుబంధము
నీవే నా జీవిత గమ్యము (2)         ||ఆరాధన||

జలములలో నే వెళ్లినా
అగ్నిలో నడిచినా
సుడి గాలులే ఎదురైనా
పెను తుఫానే చెలరేగినా (2)
నీ నామమే నను ధైర్యపరచును
నీ మాటలే నన్నాదరించును (2)         ||ఆరాధన||

English Lyrics

Audio

HOME