సన్నుతింతు యేసు స్వామి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2)
శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు
ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను           ||సన్నుతింతు||

సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)
నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును            ||సన్నుతింతును||

మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును
శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును (2)
అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును
యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము           ||సన్నుతింతును||

English Lyrics

Audio

కీర్తింతు నీ నామమున్

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

కీర్తింతు నీ నామమున్
నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్ (2)
మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2)
నిను నే కొనియాడెదన్ (4)         ||కీర్తింతు||

ప్రతి ఉదయం నీ స్తుతి గానం
దినమంతయు నీ ధ్యానం (2)
ప్రతి కార్యం నీ మహిమార్ధం (2)
సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2)          ||కీర్తింతు||

నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ
వేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2)
ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2)
నిన్నే నేను ఆరాధిస్తూ (2)          ||కీర్తింతు||

అమూల్యమైనది నీ నామం
ఇలలో శ్రేష్టమైనది నీ నామం (2)
ఉన్నతమైనది నీ నామం (2)
నాకై నిలచిన మోక్ష మార్గం (2)          ||కీర్తింతు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME