ఆలకించు దేవా

పాట రచయిత: పరంజ్యోతి గుమ్మల్ల
Lyricist: Paramjyothi Gummalla

Telugu Lyrics

ఆలకించు దేవా స్తోత్రాలాపన
ఆత్మతో సత్యముతో ఆరాధించెదం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

నీవు చేసిన మేళ్లను తలచి
మహిమ పరచెదము నిరంతరం
కృతజ్ఞత స్తుతులర్పించెదమ్
కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో
సంగీత నాధములతో గళమెత్తి గానం చేసేదము

నశించు జనులను రక్షింపను
సిలువలో రక్తము కార్చితివా
నజరేయుడ నిజ రక్షకుడా
రక్షణ ఆనందము స్వస్థత సంతోషము
శాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా

ప్రతి విషయములో ప్రార్ధించెద౦
ప్రతి రోజు ఇల ప్రార్ధించెదం
ప్రజలందరికై ప్రార్ధించెదం
ప్రార్ధననాలించు దేవా పరిస్థితులు మార్చు దేవా
ప్రార్ధన చేసెదం విజ్ఞాపన చేసెదం

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీకు సాటి ఎవరు లేరు

పాట రచయిత: ఫిలిప్ గరికి
Lyricist: Philip Gariki

Telugu Lyrics


నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)
ఇలలో నీవే ఏకైక దేవుడవు (2)
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నీదు క్రియలు కొనియాడెదను (2)
అత్యున్నతుడా నా యేసయ్యా
నీవే నాకు నిజ రక్షకుడవు (2)         ||నీకు||

పరమందు దూతలు నిను పొగడుచుందురు
నీవే ప్రభువుల ప్రభువని (2)
నీ ఘన కీర్తిని వివరించగలనా
నా ప్రియుడా నా యేసయ్యా (2)        ||అత్యున్నతుడా||

ఆకాశమనాడు ఆసీనుడైనవాడా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2)
ఊహించువాటి కంటే అత్యధికముగా
దయచేయువాడవు నీకే స్తోత్రం (2)        ||అత్యున్నతుడా||

English Lyrics

Audio

ఆశ తీర నా యేసు స్వామిని

పాట రచయిత: ఎన్ జె సైమన్
Lyricist: N J Symon

Telugu Lyrics

ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
ఆత్మతో సత్యముతో స్తుతించెదను
ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము
ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము     ||ఆశ||

దుప్పి నీటికై ఆశపడునట్లుగా
దేవుని కొరకై ఆశ పడుచున్నాను
దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)
దిన దినమాశతో కనిపెట్టుచున్నాను          ||ఎంత||

లోక ఆశలు లయమైపోవును
లోకులెవ్వరు కాపాడలేరు
లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)
లోబడు వారిని పారమున చేర్చును         ||ఎంత||

English Lyrics

Audio

స్తోత్రింతుము నిను

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

స్తోత్రింతుము నిను మాదు తండ్రి
సత్యముతో ఆత్మతో నెప్పుడు (2)
పరిశుధ్ధాలంకారములతో
దర్శించెదము శరణం శరణం (2)          ||స్తోత్రింతుము||

శ్రేష్ఠ యీవుల యూట నీవే
శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2)
త్రిత్వమై ఏకత్వమైన త్రి-
లోకనాథ శరణం శరణం (2)            ||స్తోత్రింతుము||

దవలవర్ణుడ రత్నవర్ణుడ
సత్యరూపి యనబడువాడా (2)
నను రక్షించిన రక్షకుండవు
నాథ నీవే శరణం శరణం (2)            ||స్తోత్రింతుము||

సంఘమునకు శిరస్సు నీవే
రాజా నీకే నమస్కారములు (2)
ముఖ్యమైన మూలరాయి
కోట్లకొలది శరణం శరణం (2)            ||స్తోత్రింతుము||

నీదు సేవకుల పునాది
జ్ఞానమునకు మించిన తెలివి (2)
అందముగనూ కూడుకొనుచు
వేడుకొందుము శరణం శరణం (2)           ||స్తోత్రింతుము||

రాజ నీకే స్తుతి స్తోత్రములు
గీతములు మంగళ ధ్వనులు (2)
శుభము శుభము శుభము నిత్యం
హల్లెలూయా ఆమెన్ ఆమెన్ (2)          ||స్తోత్రింతుము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సాగిలపడి మ్రొక్కెదము

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics


సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2)              ||సాగిలపడి||

మోషేకంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్ (2)
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము (2)             ||సాగిలపడి||

అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు (2)
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము (2)       ||సాగిలపడి||

ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగ తానే యుండెన్ (2)
ఆలయము మీరేయనెను
ఎల్లకాలము మ్రొక్కెదము (2)     ||సాగిలపడి||

యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2)
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము (2)        ||సాగిలపడి||

సొలోమోను కన్న శ్రేష్ఠుడు
సర్వజ్ఞానమునకు ఆధారుండు (2)
పదివేలలో అతిప్రియుండు
పదిలముగ మ్రొక్కెదము (2)        ||సాగిలపడి||

రాజులకంటే శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను చేసెన్ (2)
రారాజుగ త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము (2)        ||సాగిలపడి||

అందరిలో అతి శ్రేష్ఠుడు
మనకందరికి తానే ప్రభువు (2)
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము (2)        ||సాగిలపడి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME