ఏ రీతి స్తుతియింతునో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
ఏ రీతి స్తుతియింతునో…
నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా (2)       ||ఏ రీతి||

మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2)        ||నా ప్రాణ||

వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి
రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2)        ||నా ప్రాణ||

ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను (2)        ||నా ప్రాణ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME