కంట నీరేల

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ (2)
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు        ||కంట||

వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన (2)
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము (2)
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2)        ||కంట||

రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు (2)
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2)          ||కంట||

English Lyrics

Audio

శోధనా బాధలు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా
సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2)       ||శోధనా||

నడవలేక నా పడవ నది సముద్రమందున
నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2)
చూచెనే యేసు చెంతకు చేరెనే (2)
ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2)       ||శోధనా||

పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా
పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా (2)
చూచెనే యేసు చేయి చాచెనే (2)
లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2)       ||శోధనా||

English Lyrics

Audio

సన్నుతింతు యేసు స్వామి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2)
శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు
ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను           ||సన్నుతింతు||

సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)
నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును            ||సన్నుతింతును||

మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును
శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును (2)
అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును
యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము           ||సన్నుతింతును||

English Lyrics

Audio

HOME