పాట రచయిత: బాలరాజు
Lyricist: Balaraju
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
ఉన్నాడు దేవుడు నాకు తోడు
విడనాడడెన్నడు ఎడబాయడు (2)
కష్టాలలోన నష్టాలలోన
వేదనలోన శోధనలోన ||ఉన్నాడు||
గాఢాంధకారములో సంచరించినా
కన్నీటి లోయలో మునిగి తేలినా (2)
కరుణ లేని లోకము కాదన్ననూ (2)
కన్నీరు తుడుచును నను కొన్నవాడు ||ఉన్నాడు||
యెహోవ సన్నిధిలో నివసింతును
చిరకాలమాయనతో సంతసింతును (2)
కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2)
బ్రతుకు కాలమంతయు హర్షింతును ||ఉన్నాడు||