యేసయ్య నీ ప్రేమ

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics


యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం     ||యేసయ్య||

ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి – నీలో నే తరియించీ     ||యేసయ్య||

ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు – సర్వాధికారివి నీవు
మారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు     ||యేసయ్య||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఈ తరం యువతరం

పాట రచయిత: సతీష్ కుమార్
Lyricist: Satish Kumar

Telugu Lyrics

ఈ తరం యువతరం
ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం
ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు వార్త చాటుదాం
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం||

సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
దేవుని సేవ వ్యాపారమాయే
ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||

నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ సామీపమాయే
ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||

English Lyrics

Audio

HOME