ఈ ఉదయం శుభ ఉదయం

పాట రచయిత: అనిల్ కుమార్ వేముల
Lyricist: Anil Kumar Vemula

Telugu Lyrics

ఈ ఉదయం – శుభ ఉదయం
ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం
ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్
ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్        ||ఈ ఉదయం||

బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి
ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము
వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము
పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము        ||ఈ ఉదయం||

అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి
అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము
నీ పాదసన్నిధే – నాకు శరణము
అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము        ||ఈ ఉదయం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పొందితిని నేను

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

పొందితిని నేను ప్రభువా నీ నుండి
ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2)

జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2)
ఇంత వరకు నాకు తోడై యుండి (2)
ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2)
నా రక్షణ కర్తవు నీవైతివి (2)                        ||పొందితిని||

గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2)
అంధకార శక్తుల ప్రభావమునుండి (2)
నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2)
నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2)                       ||పొందితిని||

కష్ట దుఖంబులు నాకు కలుగగా (2)
నను చేరదీసి ఓదార్చితివే (2)
భయ భీతి నిరాశల యందున ప్రభువా (2)
బహుగా ధైర్యంబు నాకొసగితివి (2)                ||పొందితిని||

నా దేహమందున ముళ్ళు నుంచితివి (2)
సాతానుని దూతగా నలుగ గొట్టన్ (2)
వ్యాధి బాధలు బలహీనతలందు (2)
నీ కృపను నాకు దయచేసితివి (2)                ||పొందితిని||

నీ ప్రేమ చేత ధన్యుడనైతిని (2)
కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను (2)
కష్ట పరీక్షలయందు నా ప్రభువా (2)
జయజీవితము నాకు నేర్పించితివి (2)          ||పొందితిని||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME