నూతన హృదయము

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

నూతన హృదయము నూతన స్వభావము
నూతన ప్రారంభం నాకు దయచేయుము
చెదరిన బ్రతుకును పగిలిన గుండెను
నలిగిన మనస్సును నూతన పరచుము
యేసు నీవే నన్ను సృజియించిన వాడవు
నా బలహీనతలన్ని యెరిగియున్నావు
రాతి గుండెను నాలో తీసివేయుము
అతి మెత్తని హృదయము దయచేయుము         ||నూతన హృదయము||

జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని
పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని
నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను
హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని
నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక
వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను
శుద్ధజలమును నాపై వెదజల్లుము
హిమము కంటెను తెల్లగా కడిగివేయుము         ||నూతన హృదయము||

నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని
నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని
నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని
నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను
నీ శరణు కోరువారిని త్రోసివేయవు
కృపగల మహాదేవ నన్ను మన్నించుము
సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును
సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును         ||నూతన హృదయము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసయ్యా నీకే వందనం

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


భూమ్యాకాశములను సృజియించిన దేవా
నీ సన్నిధిలోనే ప్రవేశించెదను
నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు
నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము
మహిమా నీకే… ఘనతా నీకే…
ప్రతి దినం నా ఆరాధన నీకే
మహిమా నీకే… ఘనతా నీకే…
నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే
యేసయ్యా.. నీకే వందనం – (4)

మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు
వట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు (2)
నీ కౌగిలిలో నను హత్తుకొని
అర చేతులలో నను చెక్కుకొని
నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేసావు (2)
ఏమివ్వగలను నేను నీ ప్రేమకై
పగిలిన హృదయముతో ఆరాధింతును         ||మహిమా||

ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు
సిలువ పైన ప్రాణమిచ్చి వింతగా నను మార్చావు (2)
నా మనో నేత్రమును వెలిగించి
నా హృదయ కాఠిన్యమును మార్చి
అర్హతే లేని బలహీనుడనే ఎన్నుకున్నావు (2)
ఏమిచ్చి నీ ఋణమును నే తీర్తును
విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును         ||మహిమా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME