జాలిగల దైవమా

పాట రచయిత: ఎస్ జె బెర్క్మన్స్
Lyricist: S J Berchmans

Telugu Lyrics

జాలిగల దైవమా యేసయ్యా
మనసారా స్తుతింతున్‌ స్తోత్రింతును
నీవు దేవుడు సర్వశక్తుడు (2)
నీ జాలికి హద్దులే లేవు
నీ ప్రేమకు కొలతలే లేవు (2)
అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2)          ||జాలిగల||

నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొని
దుఃఖములను భరించితివే (2)
అయ్యా – దుఃఖములను భరించితివే          ||నీవు||

మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత
నీపైన పడెనే ప్రభూ (2)
అయ్యా – నీపైన పడెనే ప్రభూ          ||నీవు||

మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే
గాయములచే స్వస్థమైతిమి (2)
నీదు – గాయములచే స్వస్థమైతిమి          ||నీవు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పరిశుద్ధుడా నా యేసయ్యా

పాట రచయిత: ఫిలిప్ గరికి & లిల్లియన్ క్రిస్టోఫర్
Lyricist: Philip Gariki & Lillyan Christopher

Telugu Lyrics


పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును
మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును
ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా
యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2)

అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతును
పదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూ
రాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనా
నీతో సహవాసము – నిత్యం సంతోషమే (2)         ||పరిశుద్ధుడా||

English Lyrics

Audio

HOME