తెల్లారింది వేళ

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics


అన్నయ్య… తెల్లారింది లేరా..
తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా
మనమంతా ఆయన సృష్టే రా
పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా
వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2)

అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ
యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2)
వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను
రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2)
మరచిపోవునా               ||తెల్లారింది||

చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ
విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2)
వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని
నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2)
నీకు తెలియునా               ||తెల్లారింది||

English Lyrics

Audio

దేవుని స్తుతించ రండి

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


దేవుని స్తుతించ రండి
గత సంవత్సరమున కాపాడెన్
కీడు మనలను చేరకను – కోటి
కీడుల నుండి కాపాడినట్టి – మహా     ||దేవుని||

కోట్లకొలది మరణించిరి
మన మిచ్చట చేరియున్నాము
కష్టముల బాపి మనల నింక
జగమున జీవితులుగా నుంచినట్టి – మహా     ||దేవుని||

ఎన్ని కీడుల మనము చేసిన
నన్ని మెల్లను చేసెనుగా
నిరతము కాచి చక్కగాను
ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి     ||దేవుని||

ఏకముగా పాడి హర్షముతో
లెక్కలేని మేలులకై
ఆత్మ దేహములను బలిగా
నిపుడేసు కర్పించెద మేకముగా – చేరి     ||దేవుని||

వత్సారంభముననిను
మే మొక్కటిగా నారాధింప
దైవ కుమారా కృపనిమ్ము
మా జీవిత కాలమంతయు పాడి – మహా     ||దేవుని||

భూమి యందలి మాయల నుండి
సైతానుని వలలో నుండి
ఆత్మతో నిను సేవింప
నిపు డేలుమనుచు బ్రతిమాలెదము – కూడి     ||దేవుని|||

ప్రతి సంవత్సరమును మము జూడుము
దుర్గములో మము చేర్చుమయ్యా
దాటునప్పుడు నీ సన్నిధిని – చూపి
ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా – మహా     ||దేవుని||

స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
సకలాశీర్వాదముల నిమ్ము
ప్రేమతో ప్రభుతో నుండ
నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ – ప్రభు     ||దేవుని||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME