స్తుతించుడి

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2)
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2)
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రిస్మస్ మెడ్లీ 3

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ
ఆ ప్రభుండు పుట్టెను – బేత్లెహేము నందున

ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు
నీవొంద గాఢనిద్రపై – వెలుంగు తారలు

ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు
బేత్లెహేమందు నేడు జన్మించెన్

శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను

నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు
పొలములలో తమ మందలను కాయుచునున్నప్పుడు

భూనివాసులందరు – మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి – ఆత్మ శుద్ధి కల్గును

జ్ఞానులారా మానుడింక యోచనలన్ జేయుట
మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్

సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము
ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి

రండి నేడు పుట్టినట్టి
రాజునారాధించుడి (2)

నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము

యేసు పుట్టగానే వింత – (2)
ఏమి జరిగెరా దూతలెగసి వచ్చెరా – (2)
నేడు లోక రక్షకుండు – (2)
పుట్టినాడురా ఈ పుడమి యందున – (2)

పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో – (2)
పవళించెను… పవళించెను…
పవళించెను నాథుడు మన పాలిట రక్షకుడు – (2)

దూతల గీతాల మోత విను బేతలేమా
పరమ దూతల గీతాల మోత విను బేతలేమా
ఎన్నెన్నో యేడుల నుండి నిరీక్షించినట్టి – (2)
పరమ దూతల గీతాల మోత విను బేతలేమా – (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME