ఉతక మీద తలుపు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరుగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును

సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. (2)
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (2)    ||ఉతక||

చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు (2)
అయినను అవి క్రమము గానే నడచును
వేసవిలో ఆహారము కూర్చును (2)       ||సోమరీ||

చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రము బలము లేని జీవులు (2)
పేరు సందులలో జీవించును
బంధకములు లేనివై తిరుగును (2)       ||సోమరీ||

చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా (2)
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును (2)       ||సోమరీ||

తెల్లవారుచుండగనే పక్షులు
కిలకిలమని దేవుని స్తుతియించును (2)
బ్రతుకు తెరువు కోసమై తిరుగును
ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును (2)        ||సోమరీ||

ఓ మానవుడా నీ మనసును మార్చుకో
ఎందుకో నీ పయనము తెలుసుకో (2)
ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు
అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది (2)        ||సోమరీ||

English Lyrics

Audio

నీవు తడితే తలుపు తీయనా

పాట రచయిత: ఎం మార్క్
Lyricist: M Mark

Telugu Lyrics

నీవు తడితే తలుపు తీయనా ప్రభు
నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2)       ||నీవు||

పాపముతో నిండియున్న నా బ్రతుకును
పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా
పాపములో జీవించుచున్న నాపై
ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2)
నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి
నన్ను నడిపించగ వచ్చావయ్యా (2)       ||నీవు||

తెరిచాను నా తలుపులు రావా ప్రభు
ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను
నాలోన నీవుండి పోవాలి
నీతోనే నడవాలి ఇక మీదట (2)
రక్షణనే కేడెము చేత పట్టి
ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2)       ||నీవు||

విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి
వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా
స్వస్థతనే వరముల దయచేయుమా
కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2)
ఎల్లవేళలా నాతో ఉండి నన్ను
చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2)       ||నీవు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

హృదయమనెడు తలుపు నొద్ద

పాట రచయిత: పులిపాక జగన్నాథము
Lyricist: Pulipaaka Jagannaathamu

Telugu Lyrics

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2)        ||హృదయ||

పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2)        ||హృదయ||

కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2)        ||హృదయ||

ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2)        ||హృదయ||

అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2)        ||హృదయ||

జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2)        ||హృదయ||

సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2)        ||హృదయ||

చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2)        ||హృదయ||

అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2)        ||హృదయ||

బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2)        ||హృదయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME