నా తనువు నా మనసు

పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards

Telugu Lyrics


నా తనువు నా మనసు
నా నైపుణ్యం నీ కొరకే
నా తలంపులు నా మాటలు
నా క్రియలు నీ కొరకే
నా ప్రయాసే కాదు
నీ కరుణతో నిలిచింది ఈ జీవితం
నీ నామం కీర్తించాలని
నీ బలం చూపించాలని
అందుకేగా నన్నిలలో నియమించితివి

నీ స్వరూపముగా
నీ శ్వాసతో నను సృజియించితివి
నీ మహిమగా నేనుండుటకు
నీతోనే జీవించుటకు (2)
అందుకేగా నన్నిలలో సృజియించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి         ||నా తనువు||

గర్భ వాసమున లేనప్పుడే
నన్ను ప్రతిష్టించితివి
నీ వెలుగునే ప్రకాశించుటకు
నీ ప్రేమనే పంచుటకు (2)
అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి           ||నా తనువు||

English Lyrics

Audio

కట్టెలపై నీ శరీరం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా
కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2)        ||కట్టెలపై||

దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2)         ||ఎన్ని చేసినా||

ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2)         ||ఎన్ని చేసినా||

English Lyrics

Audio

HOME