సోలిపోయిన మనసా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)
యేసులో నీ కోరిక తీరునుగా       ||సోలిపోయిన||

యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే (2)
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు (2)

శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా (2)
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు (2)

ఎంత కాలము కృంగిపోదువు
నీ శ్రమలనే తలచుచు మనసా (2)
శ్రమపడుచున్న ఈ లోకమునకు
క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ (2)

సోలిపోకుము ఓ ప్రియ మనసా
సాగిపో ఇక యేసుని బాటలో
కలత వీడు ఆనందించు
కర్త యేసే నీతో ఉండగా
కలతకు ఇక చావే లేదు – (2)
యేసు కోరికనే నెరవేర్చు         ||సోలిపోకుము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME