దేవుని గొప్ప మహిమను

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)
ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న
వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో  మన్నా  (2)

మరచినవా నీ అపజయములు
గుర్తు లేదా! ఆ శోధనలు
నీవు చూపిన ఆ వినయములు
ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు
తండ్రి నీవే దిక్కంటూ,  మోకరిల్లిన ఆ క్షణము
అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2)  ॥ఎంత॥

అందుకొంటివి బాప్తిస్మమును
పొందు కొంటివి ఆ రక్షణను
వదలబోకు ఆత్మీయతను
చేరనివ్వకు నిర్లక్ష్యమును
తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు
నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా?  (2)  ॥ఎంత॥

English Lyrics

Audio

దేవుడు నీకు తెలుసు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా
నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2)
అవసరాలకు దేవుని నమ్మక
ఆత్మకు తండ్రని నమ్మాలి (2)
నీ ఆత్మకు తండ్రని నమ్మాలి         ||దేవుడు||

నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక
నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2)
ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక
పాపిని రక్షించు పరలోకానికి నడిపించు
నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు
నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు          ||దేవుడు||

నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి
సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2)
ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2)
దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2)
దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు
దేహానికిష్టమైనది అడగకూడదు ముందు         ||దేవుడు||

English Lyrics

Audio

ఎవరో తెలుసా యేసయ్యా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఎవరో తెలుసా యేసయ్యా
చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి
రక్షణ పొందయ్యా (2)

దేవాది దేవుడు యేసయ్యా
మానవ జన్మతో వచ్చాడయ్యా (2)
మరణించాడు మరి లేచాడు
నీ నా పాప విమోచనకై (2)        ||ఎవరో||

ధనవంతుడై యుండి యేసయ్యా
దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2)
రూపు రేఖలు కోల్పోయాడు
నీ నా పాపవిమోచనకై (2)        ||ఎవరో||

పాపుల రక్షకుడేసయ్యా
కార్చెను రక్తము పాపులకై (2)
తన దరి చేరిన పాపులనెల్ల
కడుగును తనదు రక్తముతో (2)        ||ఎవరో||

యేసే దేవుడు ఎరుగవయ్యా
రాజుల రాజుగా వస్తాడయ్యా (2)
నమ్మినవారిని చేర్చును పరమున
నమ్మని వారికి నరకమేగా (2)         ||ఎవరో||

యేసుని తరుపున ప్రతినిధినై
దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2)
అతి వినయముగా బతిమాలుచున్నాను
నేడే నమ్ముము ప్రభు యేసుని (2)       ||ఎవరో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME