తొలకరి వాన

పాట రచయిత: ఫిలిప్ & షారోన్
Lyricist: Philip & Sharon

Telugu Lyrics


తొలకరి వాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2)
అది నూతన పరచును ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును సంతోషపరచును (2)        ||తొలకరి||

ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి జీవింపచేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2)            ||అది నూతన||

సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)
యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2)            ||అది నూతన||

English Lyrics

Audio

పావురమా సంఘముపై

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)
హల్లెలూయా – హల్లేలూయా (2)

తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2)
కడవరి చినుకులు పడగా పొలములో (2)
ఫలియించెను దీవెనలే         ||పావురమా||

అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2)
సభకే జయమౌ ఉబికే జీవం (2)
ప్రబలెను ప్రభు హృదయములో         ||పావురమా||

బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2)
వెలిగే వరమా ఓ పావురమా (2)
దిగిరా దిగిరా త్వరగా         ||పావురమా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME