దుర్దినములు రాకముందే

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesly

Telugu Lyrics


దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2)       ||దుర్దినములు||

సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
తెరచి ఉంది తీర్పు ద్వారం
మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2)       ||దుర్దినములు||

రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసు క్రీస్తు ప్రభువు నందే
ఉంది నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2)       ||దుర్దినములు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అదే అదే ఆ రోజు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

అదే అదే ఆ రోజు
యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు
పాపులంతా ఏడ్చే రోజు       ||అదే అదే||

వడగండ్లు కురిసే రోజు
భూమి సగం కాలే రోజు (2)
నక్షత్రములు రాలే రోజు
నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన
మనుషులంతా చచ్చే రోజు        ||అదే అదే||

సూర్యుడు నలుపయ్యే రోజు
చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
భూకంపం కలిగే రోజు
దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

మిడతల దండొచ్చే రోజు
నీరు రక్తమయ్యే రోజు (2)
కోపాగ్ని రగిలే రోజు
పర్వతములు పగిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు         ||అదే అదే||

వ్యభిచారులు ఏడ్చే రోజు
మోసగాళ్ళు మసలే రోజు (2)
అబద్ధికులు అరచే రోజు
దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

పిల్ల జాడ తల్లికి లేక
తల్లి జాడ పిల్లకు లేక (2)
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

ఓ మనిషి యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
బలము చూసి భంగ పడకుమా
ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

English Lyrics

Audio

 

 

HOME