శ్రమలందు నీవు

పాట రచయిత: దొరబాబు
Lyricist: Dorababu

Telugu Lyrics


శ్రమలందు నీవు నలిగే సమయమున
ప్రభు నీకు తోడుండునని
యోచించలేదా? గమనించలేదా?
ఇమ్మానుయేలుండునని         ||శ్రమలందు||

శ్రమలందు ఏలియాకు కాకోలముచేత
ఆహారము పంపించ లేదా? (2)
ఈనాడు నీకు జీవాహారముతో
నీ ఆకలి తీర్చుట లేదా? (2)         ||శ్రమలందు||

శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి
రాజ్యాధికారమీయలేదా? (2)
ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి
పరలోక రాజ్యమీయలేదా? (2)         ||శ్రమలందు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME