నా యేసు రాజా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా
నా యేసు రాజా రాజా – రాజా – రాజా…
రాజా రాజా యేసు రాజా
రాజా రాజా యేసు రాజా
రాజా యేసు రాజా (2)

నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము
నన్ను బంధించెనా (2)
నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2)      ||నా యేసు||

వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన
కనికర స్వరూపుడా (2)
నా కన్నీటిని నాట్యముగా మార్చితివా (2)      ||నా యేసు||

అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే
నా నీటి ఊట నీవే (2)
అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద (2)      ||నా యేసు||

English Lyrics

Audio

వేటగాని ఉరిలో నుండి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వేటగాని ఉరిలో నుండి
నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రింద
నాకాశ్రయమిచ్చావు (2)

లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం
నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)

రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు
నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

మానవులను కాపాడుటకు
నీ దూతలను ఏర్పరిచావు
రాయి తగలకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME