వచ్చింది వచ్చింది వచ్చింది

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు (2)
మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్      ||వచ్చింది||

రంగురంగు వస్త్రాలు – మురికిగుడ్డల మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళు – మాసిపోయాయి హృదయాలు
ఇంటిపైన నక్షత్రాలు – ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తవులు – తీరుమారని జనులు (2)      ||ఇంటికి||

విద్యలేని పామరులు – విధేయులై బ్రతికారు
విద్యవున్న సోమరులు – మందిరాలకే రారు
తూర్పుదేశపు జ్ఞానులే – మోకాళ్ళు వంచినారు
చదువు పదవుంటే చాలు – మోకరించరు వీరు (2)      ||ఇంటికి||

దినములు చెడ్డవి గనుక – సమయమును పోనియ్యక
అజ్ఞానులవలె కాక – జ్ఞానులవలె నడవాలి
పాపము తీయుట కొరకే – ప్రభు పుట్టాడని తెలిసి
పాపము వీడక నీవు – ఉత్సవ ఉల్లాసాలా (2)      ||ఇంటికి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

వచ్చింది క్రిస్మస్ వచ్చింది

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది రక్షణ తెచ్చింది
ఊరూ వాడా పల్లె పల్లెల్లోన
ఆనందమే ఎంతో సంతోషమే (2)
మన చీకటి బ్రతుకులలోన
ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2)         ||వచ్చింది||

దావీదు పట్టణములో
బేత్లెహేము గ్రామములో
కన్య మరియ గర్భమునందు
బాలునిగా జన్మించెను (2)
అంధకారమే తొలగిపోయెను
చీకు చింతలే తీరిపోయెను (2)          ||మన చీకటి||

ఆకాశంలో ఒక దూత
పలికింది శుభవార్త
మన కొరకు రక్షకుడేసు
దీనునిగా పుట్టాడని (2)
పాప శాపమే తొలగించుటకు
గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2)          ||మన చీకటి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

తార వెలిసింది

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics


తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని (2)         ||తార||

మందను విడచి మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే         ||తార||

బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే        ||తార||

English Lyrics

Audio

HOME