అయ్యా నా కోసం కల్వరిలో

పాట రచయిత: భరత్
Lyricist: Bharath

Telugu Lyrics

అయ్యా నా కోసం కల్వరిలో
కన్నీరును కార్చితివా (2)
నశించిపోవు ఈ పాపి కొరకై
సిలువను మోసితివా
అయ్యా వందనమయ్యా
యేసు వందనమయ్యా (2)          ||అయ్యా||

పడిపోయి ఉన్న వేళలో
నా చేయి పట్టి లేపుటకు
గొల్గొతా కొండపై పడిపోయిన
యేసు నా కొరకు తిరిగి లేచితివి (2)          ||అయ్యా వందనమయ్యా||

అనాథ నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు
ఒంటరిగా ఉన్న మరియను
యేసు యోహానును అప్పగించితివి (2)          ||అయ్యా వందనమయ్యా||

English Lyrics

Audio

నీ వాక్యమే నన్ను బ్రతికించెను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను (2)
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2)      ||నీ వాక్యమే||

జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)
నా పాదములకు దీపమాయెను (2)
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2)       ||నీ వాక్యమే||

శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)
అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2)       ||నీ వాక్యమే||

పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది (2)
మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)
రత్న రాసులకన్నా కోరతగినది (2)           ||నీ వాక్యమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME