మందిరములోనికి రారండి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మందిరములోనికి రారండి
వందనీయుడేసుని చేరండి (2)
కలవరమైనా కలతలు ఉన్నా (2)
తొలగిపోవును ఆలయాన చేరను
కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను          ||మందిరము||

దేవుని తేజస్సు నిలిచే స్థలమిది
క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది (2)
వెంటాడే భయములైనా
వీడని అపజయములైనా (2)       ||తొలగిపోవును||

సత్యము భోదించు దేవుని బడి ఇది
ప్రేమను చాటించు మమతల గుడి ఇది (2)
శ్రమల వలన చింతలైనా
శత్రువుతో చిక్కులైనా (2)       ||తొలగిపోవును||

శాంతి ప్రసాదించు దీవెన గృహమిది
స్వస్థత కలిగించు అమృత జలనిధి (2)
కుదుటపడని రోగమైనా
ఎదను తొలిచే వేదనైనా (2)       ||తొలగిపోవును||

English Lyrics

Audio

HOME