పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
భయము లేదు మనకు
ఇకపై ఎదురు వచ్చు గెలుపు
అదిగో యేసు పిలుపు
వినుమా పరము చేరు వరకు (2)
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని ||భయము||
సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని (2)
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని (2) ||ఫలిత||
మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము (2)
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా (2) ||ఫలిత||
కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము (2)
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి (2) ||ఫలిత||
ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు (2)
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు (2) ||ఫలిత||