మా హృదయములలో

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి
మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా
ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము
ఆనందించెదము మేము ఆనందించెదము
నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము
మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము
యేసు యేసు నీ ద్వారనే
మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి
యేసు యేసు నీ వలనే కదా
మేము నీతోడి దేవునికి వారసులమైతిమి         ||మా హృదయములలో||

ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి
కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి
మా అపరాధముల కొరకు అప్పగింపబడి
మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు
మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను అనుగ్రహించుటకు
పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి         ||మా హృదయములలో||

శ్రమల కాలములో శోకముల ఘడియలలో
నీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము
మేమికను పాపులముగా నుండగానే ప్రభూ
మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి
మేమిపుడు ఇంకేమి నిన్ను కోరెదము
ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము         ||మా హృదయములలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME