సమీపించరాని తేజస్సులో నీవు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)        ||సమీపించరాని||

ధరయందు నేనుండ చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివి (2)      ||యేసయ్యా||

మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను ఇచ్చినది (2)     ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

ప్రియ యేసు నిర్మించితివి

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించునా
హృదయాంతరంగమున

నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును (2)
పవిత్రపరచుము తండ్రి
ప్రతి పాపమును కడిగి (2)          ||ప్రియ యేసు||

అజాగరూకుడనైతి
నిజాశ్రయమును విడచి (2)
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రి (2)          ||ప్రియ యేసు||

వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనే (2)
చేరితి నీదు దారి
కోరి నడిపించుము (2)          ||ప్రియ యేసు||

ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నేనుండునట్లు (2)
ఆత్మాభిషేకమునిమ్ము
ఆత్మీయ రూపుండా (2)          ||ప్రియ యేసు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME