సంతోష వస్త్రం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై

సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు
మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2)
సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం
మా దేవా నీకే అర్పితం           ||సంతోష||

నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో
దీవెన కలదు నీ ప్రతి మాటలో (2)
విడువను ఎడబాయనని
వాగ్ధానమిచ్చి బలపరచావు (2)           ||సంతోషం||

రక్షణ ఆనందం మాకిచ్చావు
మా క్రయ ధనమంతా చెల్లించావు (2)
ఏ తెగులు నీ గుడారమును
సమీపించదని సెలవిచ్చావు (2)           ||సంతోషం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME