రావయ్యా యేసయ్యా

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics


రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని…

రావయ్యా యేసయ్యా నా ఇంటికి
నీ రాకకై నే వేచియుంటిని (2)
కన్నులార నిన్ను చూడాలని (2)
కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2)       ||రావయ్యా||

యదార్థ హృదయముతో నడచుకొందును
ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2)
భక్తిహీనుల క్రియలు నాకంటనీయను
మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2)       ||రావయ్యా||

దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను
నా పొరుగు వారిని దూషింపను (2)
అహంకారము గర్వము నంటనీయను
నమ్మకస్థునిగా నే నడచుకొందును (2)       ||రావయ్యా||

నిర్దోష మార్గముల నడచుకొందును
మోసము నా ఇంట నిలువనీయను (2)
అబద్ధికులెవ్వరిని ఆదరింపను
భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2)       ||రావయ్యా||

English Lyrics

Audio

HOME