దిక్కులెన్ని తిరిగినా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2)
మనకు దిక్కు ఈ బాల యేసుడే
ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో
ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)

కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2)
స్థలము లేక తిరిగి వేసారెను
నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)
కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2)
నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
గుర్తుగా ఉన్నాయి చూడండి         ||దిక్కులెన్ని||

దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2)
తన మార్గమందు నడుప బుట్టెను
ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)
జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)
నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
హృదయాలు అర్పించినారయ్యో             ||దిక్కులెన్ని||

English Lyrics

Audio

దొరకును సమస్తము

పాట రచయిత: సి హెచ్ సాల్మోన్ రాజు
Lyricist: Ch Solmon Raju

Telugu Lyrics


దొరకును సమస్తము యేసు పాదాల చెంత
వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2)
యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా         ||దొరకును||

మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2)
పాదాలను ముద్దు పెట్టుకొని
పూసెను విలువైన అత్తరు (2)
చేసెను శ్రేష్టారాధన
దొరికెను పాప క్షమాపణ (2)            ||దొరకును||

యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి
బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2)
చిన్నదాన లెమ్మని చెప్పి
బ్రతికించెను యేసు దేవుడు (2)
కలిగెను మహదానందం
దొరికెను రక్షణ భాగ్యము (2)            ||దొరకును||

పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి
పాదాలపై పడెను పరవశుడై యుండెను (2)
పరలోక దర్శనం
చూచెను తానే స్వయముగా (2)
దొరికెను ప్రభు ముఖ దర్శనం
దొరికెను ఇల మహా భాగ్యం (2)            ||దొరకును||

English Lyrics

Audio

HOME