ఫలములనాశించిన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఫలములనాశించిన పరలోక తండ్రి
తేరి చూచుచున్నాడు నీ వైపు (2)
ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి
పరీక్షించుచున్నాడు నీ కాపు (2)
ఫలియించకుండుట నీకు న్యాయమా
యజమాని సహనముతో చెలగాటమా (2)

ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు
సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2)
చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2)
తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2)         ||ఫలియించకుండుట||

వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే
ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2)
ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2)
మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా (2)         ||ఫలియించకుండుట||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME