ఇమ్మానుయేలు రక్తము

పాట రచయిత: విలియం కౌపర్
Lyricist: William Cowper

Telugu Lyrics

ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును

యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా

ఆ యూట మున్గి దొంగయు
హా! శుద్ధు-డాయెను
నేనట్టి పాపి నిప్పుడు
నేనందు మున్గుదు

నీ యొక్క పాప మట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొర్రె పిల్ల? నీ
రక్తంబే చాలును

నా నాదు రక్తమందున
నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందు జూచెదన్

నా ఆయుష్కాల మంతటా
నా సంతసం-బిదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్
నా గాన-మిద్దియే

English Lyrics

Audio

శ్రీ యేసుండు జన్మించె

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)           ||శ్రీ యేసుండు||

ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)
ఇమ్మానుయేలనెడి నామమందున (2)        ||శ్రీ యేసుండు||

సత్రమందున పశువులశాల యందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  ||శ్రీ యేసుండు||

పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)             ||శ్రీ యేసుండు||

గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)               ||శ్రీ యేసుండు||

మన కొరకొక్క శిశువు పుట్టెను (2)
ధరను మన దోషములబోగొట్టెను (2)            ||శ్రీ యేసుండు||

పరలోకపు సైన్యంబు గూడెను (2)
మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)         ||శ్రీ యేసుండు||

అక్షయుండగు యేసు పుట్టెను (2)
మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)              ||శ్రీ యేసుండు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME