కలములతో రాయగలమా

పాట రచయిత: కృపల్ మోహన్
Lyricist: Kripal Mohan

Telugu Lyrics

కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగలమా
నీ మహోన్నతమైన ప్రేమా (2)
ఆరాధింతును (4)
రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను (2)

ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది (2)

దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)     ||ఆరాధింతును||

సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి (2)

దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)      ||ఆరాధింతును||

English Lyrics

Audio

Chords

 

Leave a Reply

HOME