మారిపోవాలి ఈ లోకమంతా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మారిపోవాలి ఈ లోకమంతా
చేరరావాలి ప్రభుయేసు చెంత (2)
మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ (2)
పంచుకోవాలి పరవారితో            ||మారిపోవాలి||

మనము వెలగాలి ఒక దివ్య వెలుగై (2)
వెలిగించాలి ఈ జగతినంతా (2)
కదలి రావాలి కరుణంత మనలో (2)
కరిగిపోవాలి కఠినాత్ములంతా (2)        ||మారిపోవాలి||

మనము బ్రతకాలి విలువైన బ్రతుకు (2)
బ్రతికించాలి ప్రభుయేసు బోధ (2)
ఆదుకోవాలి నర జాతినంతా (2)
అందించాలి ప్రభు వాక్యమెంతో (2)       ||మారిపోవాలి||

మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ (2)
మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ (2)
వినిపించాలి మన సాక్ష్యమంతా (2)
కదిలించాలి హృదయాలనంతా (2)       ||మారిపోవాలి||

English Lyrics

Audio

 

 

Leave a Reply

HOME