వాడుకో నా యేసయ్యా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


వాడబారని విశ్వాసం – ఎప్పుడూ.. కోపగించని వాత్సల్యం
పాపమెంచని ఆంతర్యం – నీతో.. వీడదీయని సాంగత్యం
దయచేయుమా నాకు నా యేసయ్యా
సరిచేయుమా నన్ను నా యేసయ్యా
వాడుకో నా యేసయ్యా
అని వేడుకుంటున్నానయ్యా (2)
రాజా రాజా రాజుల రాజా
రాజా రారాజా నా యేసు రాజా (2)

ఏలియా ప్రవక్త
యోర్దాను నదీ సమీపమున
ఆహారమే లేకయుండగా
ఆ మహా కరువు కాలమున (2)
కాకోలముచే ఆహారమును పంపిన దేవా (2)
కాకోలాన్నే వాడిన దేవా
కడుహీనుడనైన నన్నును కూడా        ||వాడుకో||

బెయేరు కుమారుడు బిలాము
దైవాజ్ఞను మీరగా
మోయాబుకు పయనమైన వేళ
తన నేత్రాలు మూయబడగా (2)
గాడిదకు మాట్లాడుటకు పలుకిచ్చిన దేవా (2)
గాడిదనే వాడిన దేవా
గతిలేనివాడను నన్నును కూడా         ||వాడుకో||

English Lyrics

Audio

Leave a Reply

HOME