యేసుని ప్రేమ యేసు వార్త

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసుని ప్రేమ యేసు వార్త
వాసిగ చాటను వెళ్ళెదము
ఆశతో యేసు సజీవ సాక్షులై
దిశలన్నిటను వ్యాపించెదము
వినుము ప్రభుని స్వరము (2)
ప్రభు యేసు సన్నిధి తోడు రాగా
కడుదూర తీరాలు చేరెదము        ||యేసుని||

మరణ ఛాయ లోయలలో
నాశన కూపపు లోతులలో (2)
చితికెను బ్రతుకులెన్నో (2)
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము      ||యేసుని||

కాపరి లేని గొర్రెలుగా
వేసారెనుగ సమూహములే (2)
ప్రజలను చూచెదమా (2)
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము      ||యేసుని||

English Lyrics

Audio

 

 

Leave a Reply

HOME