నా ప్రాణప్రియుడా నా యేసురాజా

పాట రచయిత: విక్టర్ రాంపోగు
Lyricist: Victor Rampogu

Telugu Lyrics


నా ప్రాణప్రియుడా నా యేసురాజా
నా యేలినవాడా నా స్నేహితుడా (2)
నిన్ను చేరాలని నీతో ఉండాలని (2)
నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం (2)         ||నా ప్రాణ||

నీ స్వరము నే వింటిని – ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యా
నీ ముఖము నే చూచితిని – మనసానందమాయేనా (2)
నీ ప్రేమను రుచి చూచితి
నీ వశమైతిని యేసయ్యా (2)         ||నా ప్రాణ||

నీ చేయి నే పట్టుకొని – నీతో నడవాలనుంది యేసయ్యా
నీ భుజమును నేనానుకొని – నీతో బ్రతకాలనుంది యేసయ్యా (2)
నిన్ను హత్తుకొని
నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా (2)         ||నా ప్రాణ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME