పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా
ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా
నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా (2)
హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా
హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా ||ఎందుకో||
నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు
పాతాళ వేదన శ్రమలనుండి
నన్ను విడిపించావు (2) ||నీ కృపను||
నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు
నా గాయములను బాగు చేయ
నీవు శ్రమనొందావు (2) ||నీ కృపను||
నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు
పరలోక పరిచర్య భాగస్వామిగా
నన్ను స్వీకరించావు (2) ||నీ కృపను||
English Lyrics
Audio
Download Lyrics as: PPT