గడచిన కాలము

పాట రచయిత:  ఎన్ జాన్ వెస్లీ
Lyricist: N John Wesley

Telugu Lyrics

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)        ||గడచిన||

కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)       ||గడచిన||

లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2)        ||గడచిన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

6 comments

  1. Thanks, praises, grace, adore be to God for the time to listen awesome song through His child. Amen

Leave a Reply

HOME