ప్రభువా నీవే నాదు శరణం

పాట రచయిత: లంకపల్లి శామ్యూల్ జాన్
Lyricist: Lankapalli Samuel John

Telugu Lyrics

ప్రభువా నీవే నాదు శరణం
ఆశ్రయించితి నీ చరణములే (2)
అపవాది క్రియలందు బంధీనైతిన్
కృప చూపి నను విముక్తుని చేయుమా
విపరీతి గతి పొందియుంటిన్
నీదు ముక్తి ప్రభావింపనిమ్ము          ||ప్రభువా||

మరణ ఛాయలు నాపై బ్రమ్ముకొనెను
కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము
చెదరిన నీదు ప్రతి రూపం
నాపై సరి చేసి ముద్రించు దేవా

నీ న్యాయ విధులన్ని భంగ పరచి
గాయపరచితి నేను అపరాధిని
పరితాపమును పొందుచుంటి
నాదు పాపము క్షమియించు దేవా      ||ప్రభువా||

పాప భారము తొడ అరుదించితి
సేద తీర్చుము శాంతి జలములతో
నీ ప్రేమ రుధిర శ్రవంతి
శాప భారము తొలగించు దేవా      ||ప్రభువా||

శరణం యేసు చరణం (4)        ||ప్రభువా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 


 

Leave a Reply

HOME